TPT: టీటీడీ ఈవో జె.శ్యామలరావు మంగళవారం సాయంత్రం కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులు పొందారు. తిరుపతిలోని వినాయక నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్న కంచి మఠాన్ని ఈవో సందర్శించారు. సమాజ శ్రేయస్సు కోసం టీటీడీ చేపట్టాల్సిన పలు ధార్మిక కార్యక్రమాలపై స్వామివారు పలు సూచనలు చేశారు.