TG: నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 1.59 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 2.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు నమోదైంది. ప్రస్తుత నీటిమట్టం 588.90గా ఉంది.