హైదరాబాద్: 28°C
క్రీడలు

టీజీ20.. కరీంనగర్‌పై ఖమ్మం ఏసెస్ విజయం

Advertisement

టీజీ20 లీగ్‌లో భాగంగా అన్విత ఖమ్మం ఏసెస్ 8 పరుగుల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌పై విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కరీంనగర్.. 20 ఓవర్లలో 207/9 పరుగులు చేసింది. సాత్విక్ రెడ్డి (63), శుభమ్ (54), చందన్ సహాని (38) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో మిలింద్ 4, సహేంద్ర 2 వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం 213 పరుగులు చేసింది.

Advertisement

Advertisement