»Once Again Tdp Chief Nara Chandrababu Naidu Said Hyderabad I Planted Seed
Hyderabad నేను నాటిన విత్తనమే: TDP అధినేత చంద్రబాబు
హైటెక్ సిటిలో శిక్షణ పొంది అమెరికాలో పురుషులతో సమానంగా వేతనం తీసుకుంటున్న శిరీష అభినందనీయురాలు’ అని తెలిపారు. ‘తెలుగు వారు అమెరికాలో ఇతర దేశస్తుల కంటే సమర్థవంతంగా పని చేసి అధికంగా సంపాదిస్తున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad)ను తానే నిర్మించానని మరోసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. హైదరాబాద్ తాను నాటిన విత్తనమేనని తెలిపారు. ‘నేను నాటిన విత్తనం ఇప్పుడు అభివృద్ధి చెందింది’ అని పేర్కొన్నారు. తన జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యధికంగా ధనికులు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ 65వ స్థానంలో నిలబడడంపై ఆయన స్పందించారు.
ప్రకాశం జిల్లా (Prakasam District) మార్కాపురంలో (Markapuram) గురువారం తన జన్మదిన (Birthday Celebrations) వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ 65వ నగరంగా ఉంది. ఎక్కువగా ధనికులు ఉన్నారు. ఒకప్పుడు నేను నాటిన విత్తనం ఇప్పుడు అభివృద్ధి చెందింది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారై శిరీషను అభినందిస్తూ.. ‘హైటెక్ సిటిలో శిక్షణ పొంది అమెరికాలో పురుషులతో సమానంగా వేతనం తీసుకుంటున్న శిరీష అభినందనీయురాలు’ అని తెలిపారు. ‘తెలుగు వారు అమెరికాలో ఇతర దేశస్తుల కంటే సమర్థవంతంగా పని చేసి అధికంగా సంపాదిస్తున్నారు. ఎన్నారైలు తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
తొలిసారి మహిళలకు రిజర్వేషన్లు అందించిన పార్టీ టీడీపీ (TDP). ఎన్టీఆర్ (NT Rama Rao) తొలిసారి మహిళలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆస్తిలో ఆడవారికి సమాన హక్కు ఇచ్చారు. ఉద్యోగాలు, కళాశాలల్లో 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చాం. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం. ఎస్సీ, ఎస్టీలకు గౌరవం కల్పించిన పార్టీ కూడా మాదే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి. దళితులపై దాడులు చేసి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటాం’ అని చంద్రబాబు తెలిపారు.