అనంతపురం: యాడికిలోని చింతవనం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద మట్కా రాస్తే కరుణాకర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 3,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీఐ వీరన్న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎక్కడైనా మట్కా రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు