CTR: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ప్రతి కేంద్రం వద్ద కళాశాల పేరు, పరీక్ష కేంద్రం నంబర్ కనిపించేలా ఫ్లెక్సీలు చేయాలన్నారు. నో సెల్ఫోన్ జోన్ అని విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.