హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం

TPT: నాయుడుపేట పురపాలక ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఆదివారం ముగియడంతో సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. నిబంధనల ప్రకారం పత్రాలను తనిఖీ చేసి అర్హత కలిగిన నామినేషన్లను ఖరారు చేయనున్నారు. దీంతో నాయుడుపేట పురపాలక ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం మొదలైంది.