హైదరాబాద్: 28°C
వార్తలు

పౌర సమస్యలు పరిష్కరించాలి: బీఆర్‌ఎస్

ఖమ్మం నగరంలో కుంటుపడిన పౌర సేవలను పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్ నాయకులు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. పలు డివిజన్లలో వీధిదీపాలు వెలగకపోవడం, పారిశుధ్య లోపంతో దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.