హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలలో రేపు సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవం

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని రేపు ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయ్యాక ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5 - 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఆనంద నిలయంలో శ్రీవారికి హారతిస్తారు. దీపోత్సవం కారణంగా ప్రతి నెలా పౌర్ణమి రోజు TTD నిర్వహించే గరుడ సేవను, సహస్ర దీపాలంకరణ సేవను TTD రద్దు చేసింది.