హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కృష్ణాబోర్డును కలవనున్న BRS బృందం

TG: బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులతో సమావేశం కానుంది. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల దృష్ట్యా నాగార్జున సాగర్‌లోని నీటి నిల్వలను రక్షించాలని.. KRMBని BRS నేతలు కోరనున్నారు. అలాగే, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై తమ తీవ్ర అభ్యంతరాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయనున్నారు.