హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిడిపి అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేత

W.G: ఈనెల 28న జరగనున్న ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కూటమిలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు చేతుల మీదగా బి ఫామ్స్ అందజేశారు. చైర్మన్ అభ్యర్థి నీలోఫర్‌తో పాటు టిడిపి నుండి పోటీ చేయనున్న 18 మంది సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జుత్తిక నాగరాజు, ప్రసాద్, ఉమా పాల్గొన్నారు.