హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టులో వైభవ్ లేడని సినిమా చూశాం: మాజీ క్రికెటర్

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడంపై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ స్పందించాడు. తాము మ్యాచ్ చూడటం ఆపేసి.. సినిమా చూసినట్లు తెలిపాడు. వైభవ్ ఎందుకు ఆడటం లేదని తన భార్య కూడా ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు. అతడిని తుది జట్టులో తీసుకోకపోవడంపై ఆమె వాదనకు దిగినట్లు వెల్లడించాడు. వైభవ్ పట్ల మేనేజ్‌మెంట్ సరిగ్గా వ్యవహరించడం లేదని మండిపడ్డాడు.