హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెల్లవారుజామునే నీటి కోసం అవస్తలు

ADB: బజార్హత్నూర్ మండలం బాలన్పూర్ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గ్రామంలోని ఒక్క చేతిపంపే ఆధారమైంది. దీంతో నీటి కోసం ఉదయం 4 గంటల నుంచే ప్రజలు చేతిపంపు వద్ద బారులు తీరాల్సి వస్తోంది. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.