JGL: గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఈ ఏడాది ఏర్పాటు చేసిన 12 వినాయక మండపాల్లోనూ ప్రధాన గణపతి విగ్రహాలను మట్టితోనే ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామపంచాయతీ ఇచ్చిన పిలుపుకు మండప నిర్వాహకులు, యువత, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. ఈ నిర్ణయం గ్రామ ప్రజల ఐక్యత, పర్యావరణ బాధ్యతకు నిదర్శనమని సర్పంచ్ కాసం రాజశేఖర్ అన్నారు.
తెలంగాణ
లక్ష్మీపూర్‌లో 12 మండపాల్లో మట్టి గణపతులు


