హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారింజ వాగులో మృతదేహం లభ్యం

SRD: జహీరాబాద్- కొత్తూరు సమీపంలోని నారింజ వాగులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని పట్టణంలోని గడి వీధికి చెందిన మహమ్మద్ బాబు మియాగా పోలీసులు నిర్ధారించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.