హైదరాబాద్: 28°C
వార్తలు

దరఖాస్తులకు గడువు పొడిగింపు

TG: ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30 వరకు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించింది. బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు మంత్రి  పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.