CTR: పెద్దపంజాణిలో గురువారం ఉదయం 9 గంటలకు వైసీపీ మండల స్థాయి సమావేశం జరుగుతుందని ఆ పార్టీ మండల కన్వీనర్ బాగారెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ హాజరై పార్టీ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పెద్దపంజాణిలో మండల స్థాయి సమావేశం


