హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైలు కింద పడిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్

KKD: తుని రైల్వేస్టేషన్లో మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి అలప్పీ వెళ్తున్న ధనబాద్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు అదుపు తప్పి కింద పడ్డాడు. అక్కడే ఉన్న ఎలమంచిలి రూరల్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు వెంటనే స్పందించి, రైలు దిగి ప్రయాణికుడిని సురక్షితంగా బయటికి తీసి మానవత్వం చాటుకున్నారు.