PLD: పిడుగురాళ్లలో ఇళ్లు కాదు ఊళ్లు కడతామని గొప్పలు చెప్పిన గత YCP ప్రభుత్వం లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విఫలమైంది. జిల్లాలోని పలుచోట్ల 2022లో మొదలైన ఇళ్ల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదు. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో రూ. వందల కోట్లు ఖర్చుచేసి ఏర్పాటుచేసిన కాలనీలు నివాసయోగ్యంగా లేక వెలవెలబోతున్నాయి. కనీస వసతులులేక వేల ఇళ్లు పూర్తయినా వాటిల్లో పదుల సంఖ్యలోనే పేదలు నివాసం ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఊళ్లు కాదు.. గూళ్లు!


