ELR: దెందులూరు (M) గాలాయగూడెం శివారు నాగులదేవునిపాడుకు చెందిన కొత్తపల్లి రఘురాం (20) మృతదేహం పెదవేగి (M) అంకన్నగూడెం సమీపంలోని పోలవరం కుడి కాలువ లాకుల వద్ద మంగళవారం లభ్యమైంది. ఇంట్లో గొడవ కారణంగా ఈనెల 11న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. రఘురాం కోసం గాలిస్తుండగా కాలువ గట్టుపై మోటారు సైకిల్, బీటెక్ ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ కనిపించాయి. గాలింపు ముమ్మరం చేయగా మృతదేహం లభించింది.
ఆంధ్రప్రదేశ్
కాలువలో యువకుడి మృతదేహం లభ్యం


