NTR: తిరువూరులోని సాయిబాబా ఆలయంలో ఈనెల 17న ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలమన్నారు. ప్రతి కార్యకర్తను గౌరవించడం తన విధానమని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
17 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారం: ఎమ్మెల్యే


