హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతి అకాడమీకి ఆర్థిక సాయం

SKLM: నరసన్నపేట మండలం గొట్టిపల్లి గ్రామంలోని అమరావతి అకాడమీకి దాతలు రూ.20 వేల విరాళం అందించారు. పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ ప్రతిభను వెలికితీస్తున్న ఎక్స్ ఆర్మీ కోచ్‌లు సురేష్, నాగేశ్వరరావుల సేవలను అభినందిస్తూ చిన్నమనసు వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకట్రావు రూ.10 వేలు, నీతింటి విశ్వేశ్వరరావు మరో రూ.10 వేలు మంగళవారం అందించారు.