హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భక్తులను ఆకట్టుకుంటున్న 'దీవించే వినాయకుడు'

కోనసీమ: అమలాపురం పట్టణంలో 'దీవించే వినాయకుడు' విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్థానిక గడియార స్తంభం సెంటర్లో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో రూ. 5 కాయిన్ వేస్తే భక్తులకు స్వామి వారు చేయి పైకి ఎత్తి ఆశీస్సులు అందిస్తారు. ఈ విగ్రహం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పలువురు కాయిన్ వేసి ఆశీస్సులు పొంది, మొబైల్‌లో ఫోటోలు తీసుకుంటున్నారు.