హైదరాబాద్: 28°C
క్రైమ్

నిద్రిస్తున్న VROపై కత్తులతో దాడి

AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల VROపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. నిన్న రాత్రి మారందొడ్డిలోని ఇంట్లో VRO బోయ గోపాల్ నిద్రిస్తుండగా దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. గోపాల్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.