TG: నల్గొండ జిల్లా చింతలపాలెంలో పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. వినాయక పూజ చేస్తుండగా ఉప్పల దత్తు ప్రసాద్ అనే పూజారి మృతి చెందారు. మరో మండపంలో పూజల విషయమై కొందరు వ్యక్తులు గొడవపడి ఆయన్ను అక్కడికి తీసుకెళ్లగా, పూజ నిర్వహిస్తుండగా ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
గణపతి మండపంలో పూజారి హఠాన్మరణం


