TG: కామారెడ్డి జిల్లా బిక్కూరులో పండగ పూట విషాదం నెలకొంది. వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. జంగంపల్లి ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. అయితే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు నిజామాబాద్ పట్టణానికి చెందిన దివ్యవాణిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


