హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆరు నెలల గర్భవతిని చంపిన భర్త

TG: సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో దారుణం జరిగింది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త పరశురామ్ చంపేశాడు. భార్య శివానీని గొంతు నులిమి హత్య చేశాడు. వీరి ఇరువురికి ఆరు నెలల ముందే వివాహం అయింది. భార్యపై అనుమానంతో చంపినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.