హైదరాబాద్: 28°C
క్రైమ్

కలువ పూలకు వెళ్లి ఇద్దరు మృతి

AP: తూ.గో. జిల్లా కోరుకొండ మండలంలో వినాయక చవితి పర్వదినం విషాదాన్ని నింపింది. గానుగూడెం గ్రామానికి చెందిన గొనిపాటి శివ(38), సోడదాసి వీరబాబు(35) వినాయక చవితి పూజ కోసం కలువ పూలు సేకరించేందుకు గ్రామ చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే వారు మృతిచెందినట్లు తెలుస్తోంది.