TG: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో దారుణం జరిగింది. బాలికపై 9 మంది యువకులు అత్యాచారం చేశారు. మూడు రోజులపాటు మూడు ప్రాంతాలకు బాలికను తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి విక్కీ అండ్ గ్యాంగ్ ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే 9 మందిపై పోక్సో కేసు పెట్టి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
క్రైమ్
దారుణం.. బాలికపై 9 మంది అత్యాచారం


