హైదరాబాద్: 28°C
తెలంగాణ

16న సామూహిక నిరాహార దీక్షలు

NLG: కలెక్టరేట్ ఎదుట సెప్టెంబర్ 16న సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి సలీం తెలిపారు. నల్గొండలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మిక వర్గ పోరాటాలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోలీసు నిర్బంధాన్ని, ముందస్తు అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆశా, అంగన్వాడీలు, ఆర్టీసీ కార్మికుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.