VKB: పండుగ వేళ ప్రాణదాతలు ముందుకొచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రక్తం కొరత ఉందని తెలుసుకున్న రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని సూచించారు.
తెలంగాణ
పండుగ వేళ రక్తదానం చేసిన యువకులు


