BHNG: యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కార్యాలయంలో సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించారు.
తెలంగాణ
మట్టి వినాయకునికి పూజలు చేసిన ఎమ్మెల్యే


