హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి'

JN: వ్యవసాయ, విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి జనగామ జిల్లాలో సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని వరంగల్ ఎంపీ, దిశా కమిటీ ఛైర్‌పర్సన్ డా. కడియం కావ్య సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.