HYD: సికింద్రాబాద్ ప్రాంతాలను వరుణుడు ముంచెత్తాడు. ఆదివారం కురిసిన వర్షానికి బేగంపేట, లాలాగూడ పరిసరాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వరద ప్రవాహానికి అడ్డుగా నిలిచిన చెత్తను తొలగించి నీరు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు. మరికొన్ని చోట్ల పంపులు ఏర్పాటు చేసి నీటిని తోడించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలను పర్యవేక్షించారు.
వార్తలు
వరద నీటిని తొలగించిన హైడ్రా సిబ్బంది


