హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏకగ్రీవాల పేరుతో ఓటు హక్కు హరిస్తే ఊరుకోం'

కడప ఏకగ్రీవాల పేరుతో ప్రజల ఓటు హక్కును హరించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ హెచ్చరించారు. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగాలని, ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు. కడప మేయర్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంటుందని, 66 డివిజన్లలో 35 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.