అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కనీస మందులు కూడా అందుబాటులో లేవని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కుక్కకాటుకు చికిత్స కోసం వచ్చిన బాధితుడు బయట నుంచి టీటీ ఇంజక్షన్ తీసుకువచ్చినా నర్సులు నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. అధికారులు వెంటనే మందుల కొరతను నివారించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మందులు లేక ఆసుపత్రిలో రోగుల అవస్థలు


