హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టిన రైతులు

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో ఇవాళ రైతులు గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టారు. గ్రామ పరిధిలోని పంట కాలువలు, నీటి వనరుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు. గుర్రపు డెక్క తొలగింపు ద్వారా కాలువల్లో నీటి ప్రవాహం మెరుగుపడి పంటలకు సాగునీరు సక్రమంగా అందే అవకాశం ఉందని రైతులు తెలిపారు.