హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటి రుద్రాక్షలతో గణపయ్యను చూశారా?

VSP: విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని గోకుల్‌ పార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన వినూత్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేపాల్‌తోపాటు కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రుద్రాక్షలను తెప్పించి ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. యూత్‌ ఐకాన్‌ ఆధ్వర్యంలో సీరాపు రాజు, ఆయన బృందం ఈ ప్రత్యేక గణపయ్యను ఏర్పాటు చేశారు.