హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విశాఖ: గాయత్రీనగర్‌లోని జీవీఎంసీ పార్కులో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఇవాళ విద్యుత్ వైర్ తగలడంతో కెల్లా భరత్‌కుమార్ (35) విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.