హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏటికొప్పాకలో పోలీసులు పల్లె నిద్ర

AKP: ఏటికొప్పాకలో ఎలమంచిలి పోలీసులు నిన్న రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ప్రజలకు ఎలమంచిలి రూరల్ ఎస్ ఉపేంద్ర విజ్ఞప్తి చేశారు.సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు, ట్రాఫిక్‌ నిబంధనలు, మహిళలు,చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలన్నారు.