E.G: రాజమండ్రి టీవీ రోడ్డులో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆకృతిలో ప్రత్యేకంగా రూపొందించిన విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాణిపాకం వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇక్కడే స్వామివారిని దర్శించుకునేలా వీటిని తయారు చేయడంతో భక్తులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. విగ్రహాల అద్భుత ఆకృతి, ఆకర్షణీయమైన అలంకరణలు స్థానికులను ఎంతగానో విశేషంగా కట్టిపడేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆకృతిలో ప్రత్యేక ప్రతిమలు


