హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుల ఘర్షణ.. బీర్ బాటిల్‌తో దాడి

కాకినాడ జిల్లా పిఠాపురం కాంప్లెక్స్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద యువకుల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పరస్పరం దాడులు చేసుకోవడంతో హరికుమార్ అనే యువకుడిపై కొందరు బీర్ బాటిల్‌తో దాడి చేశారు. ఈ దాడిలో అతడి ఎడమ చెవి, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.