NLR: నగరంలోని ఇరుగాలమ్మ గుడి సమీపంలో గణేశ్ ఘాటు వద్ద సోమవారం వినాయక చవితి సంబరాలు జరిగాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించారు. కూచిపూడి కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కూచిపూడి కళాకారులను మంత్రులు, ఎమ్మెల్యేలు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూచిపూడి కళాకారులకు సత్కారం


