హైదరాబాద్: 28°C
క్రీడలు

20 వికెట్లు తీయడం నేర్చుకోవాలి: గవాస్కర్

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో విజయం సాధించడంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేయడం అలవాటు చేసుకోవాలని సూచించాడు. దేశవాళీ క్రికెట్‌లోనే 20 వికెట్లు తీయడం నేర్చుకుంటేనే అంతర్జాతీయంగా రాణించగలమన్నాడు. శ్రీలంకతో టెస్టులోనూ ఇదే సమస్య ఎదురైందని గుర్తుచేశాడు.