BPT: చీరాల (మం) ఆదినారాయణపురానికి చెందిన 70 ఏళ్ల ST మహిళ మట్రా జాలమ్మపై సీఐ శశికుమార్, ఇతర సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని జాతీయ ST కమిషన్ (NCST)కు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధితురాలికి భద్రత కల్పించాలని ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మ కోరారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ విచారణ చేపట్టనుంది.
ఆంధ్రప్రదేశ్
పోలీసులపై జాతీయ ST కమిషన్‌కు ఫిర్యాదు


