హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రమంగా బయటపడుతున్న సంగమేశ్వరాలయం

నంద్యాల: ఆత్మకూరు సమీపంలోని సప్తనదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరాలయం కృష్ణానది నుంచి క్రమంగా బయటపడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గి ఆలయ శిఖర కలశం భక్తులకు దర్శనమిస్తోంది. మార్చి 23న తొలి పూజలు, ఆగస్టు 1న చివరి పూజలు అందుకున్న ఈ క్షేత్రం, పుష్కర కాలం తర్వాత మళ్లీ సెప్టెంబర్ రెండో వారంలో వెలుగులోకి రావడం విశేషం.