హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో అంకురార్పణ వేడుకలు

TPT: తిరుమలలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలని ప్రార్థిస్తూ అంకురార్పణం నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారి ఊరేగింపు అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి నవధాన్యాలను నాటారు. అంకురార్పణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. కార్యక్రమంలో టీటీడీ అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.