SRPT: చివ్వేంల మండల పరిధిలోని చందుపట్ల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న బైక్ ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. స్థానికులు గాయపడిన వారిని చివ్వేంల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు


