BHPL: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద గ్రేడ్-1 నర్సింగ్ ఆఫీసర్ ఉమేశ్వరి ఆధ్వర్యంలో నర్సింగ్ ఆఫీసర్లు, రేడియోగ్రాఫర్లు, శానిటేషన్ సూపర్వైజర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడి నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఉమేశ్వరి సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా వినాయక చవితి


