హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాన పడితే కాలనీ రోడ్లన్నీ జలమయం..!

MLG: ఇవాళ కురిసిన వర్షానికి శ్రీనివాస కాలనీ రోడ్డు జలమయమైంది. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ బురద రోడ్డుపైకి చేరి దుర్గంధం వెదజల్లుతోందని, రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ నిధులతో రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.